RSS

బై..బై..హస్తినాపురం..

హయ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నా ఆలోచనలతో మీ ముందుకు వచ్చాను...మూడు సంవత్సరాలు డిల్లీలో ఉండి వెళుతున్న నాకు నా అనుభవాలను మీతో పంచుకోవాలనిపించింది..సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చలితో నగరం గడ్డకట్టుకుంటున్న వేళ దేశరాజధానిలో అడుగుపెట్టాను..ఈ మూడు సంవత్సరాలు కాలం చాలా వేగంగా పరిగెత్తింది ..ఈ మూడేళ్ళలోనే ఒక్కడిని ఇద్దరం..ఆపై ముగ్గురం కూడా అయ్యాము.. మహాటివి నాకు దేశ రాజకీయాలను దగ్గర నుండి మరీ ముఖ్యంగా దేశ నాయకులను దగ్గరనుండి చూసే అవకాశం కల్పించింది..నేను డిల్లీలో అటెండ్ అయిన మొదటి ప్రెస్ మీట్
ఈ మూడేళ్ళ కాలంలో నాలో చాలా పరిణితి వచ్చింది ..అయితే నాలో ఉన్న సైటైరిక్ స్వభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగిన మాట వాస్తవం..అలానే ఈ మూడేళ్ళల్లో వార్తల వెనుక వాస్తవాలు తెలుసుకోగలిగాను..ఢిల్లీ వచ్చిన కొత్తల్లో బెరుకు బెరుకుగా తిరిగిన ప్లేసులు ఇప్పుడూ వదిలి వెళ్తుంటే బాధ గా ఉంది ..ఇంకా సోనియా గాంధీ ..ఆజాద్ ఇంటి దగ్గర..పడిగాపులుండవు అలానే విజయ్ chowk దగ్గర నేతల కోసం నిరీక్షణలుండవు అనేది తల్చుకుంటే మనసు కెలికినట్టుంది అవును మరీ అక్కడ సొల్లు చెప్పుకుంటు తినే పల్లీలు..మసాల చాట్ ఉండవు కదా
డిల్లీ వచ్చిన ఓ సంవత్సరం తర్వాత ఇంట్లో పెళ్ళి చేసుకోమని పోరుతుంటే మిత్రులందరు కొంచెం లావుగా ఉన్నావు అంటే సీరియస్ గా షటిల్ ఆడటం మొదలుపెట్టాను..సుమారు సంవత్సరం పాటు ఆపకుండా ఆడి ఇంట్లో వాళ్ళూ తిట్టేంత సన్న బడ్డాను.నేను ఆపకుండా సంవత్సరం పాటు షటిల్ ఆడాను అంటే నా అత్యంత సన్నిహితమిత్రుడు జయప్రకాష్ అలియాస్ జెపి నే కారణం
అలా అలా జాలీగా ఆడుకుంటూ పని చేసే సదుపాయం డిల్లీలో మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ యాక్టివిటి అంతా మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచేం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవటానికి సాద్యం అవుతుంది వివాహ విద్యా నాశాయ అన్నట్టు నా విషయంలో మాత్రం వివాహా షటిల్ నాశాయ అయ్యింది పెళ్ళై కాపురం పెట్టిన తరువాత ఇప్పటి వరకు తిరిగి బ్యాట్ పట్టుకుంటే ఓట్టు ..మరీ...డిల్లీ వచ్చిన తరువాత ఇద్దరు మాత్రమే ఆత్మ బంధువులు అయ్యారు..నేను ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో అర్ధం చేసుకుని నేను ఏమన్న డిల్లీలో సాధించింది ఉంది అంటే దానిలో భాగం వీరిద్దరికి దక్కుతుంది
ఢిల్లీలొ పనిచేయటం వల్ల పొలిటికల్ వార్తలతో పాటు సుప్రీంకోర్టులో వచ్చే కేసుల వార్తలను కూడా కవర్ చేయటం ఎలానో నేర్చుకునే అవకాశం దక్కింది..దాంతో పాటు మన దేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కామన్ వెల్త్ గేమ్స్ ,,వరల్డ్ కప్ మ్యాచ్ లను కవర్ చేసే అవకాశం దక్కింది
మొత్తం మీద ఢిల్లీ వదిలి వెళ్ళాలని లేనప్పటికి మా అబ్బాయి కోసం హైదరబాద్ వెళ్ళక తప్పని పరిస్థితి ..మూడు సంవత్సరాల క్రితం అయినను పోయి రావలే హస్తినాపురికి అన్నట్లు వచ్చిన నేను అయిష్టంగానే తిరిగి భాగ్యనగరానికి వెళుతున్నాను్...మిస్ యు ఢిల్లీ

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నాన్న ...







బ్లాగింగ్ చేయక చాల రోజులు అయ్యింది..ఈ రోజు కొంచెం ఫ్రీ గా ఉన్నట్లు అనిపించి అది నాన్న మీద రాద్దాము అని మొదలు పెడుతున్నాను


నా పదో తరగతి అయ్యేంతవరకు నాన్న అంటే వణుకు..భయం..ఇంకా ఏదన్న ఉంటే అంతకంటే ఎక్కువే ..తరువాత డిప్లొమా..ఇంజనీరింగ్ ..ఇది అయ్యేంతవరకు కూడా నాన్న అంటే భయం ..ఎదురుగా కూర్చుని మాట్లాడాలంటే ఏదో తెలియని తత్తర పాటు ..ఏది కావాలి అన్న అమ్మే చెప్పాలి ..నువ్వు ఎందుకురా నాతొ మాట్లాడవు అంటే ఇది కారణం అని చెప్పలేని అసయాత..నువ్వు ఇదే చదవాలి అంటే నో నేను అది చదవును ఇదే చదువుతాను అని గట్టిగా చెప్పలేని భయం అమ్మ కు చెపితే నాన్న నీ మంచికే కదా చెప్పేది విను అనేది..ఒక్కడినే కాబట్టి గారాబం చేస్తే చెడిపోతాను అని భయమో..లేక గాంభీర్యం నటించే వారొ తెలియదు కానీ నాతో పట్టుమని పది నిమిషాలు నువ్వు ఏమి చదువుదాము అనుకుంటున్నావు అని అడిగేవారు కాదు ..ఏదో అలా అలా చదువు ముగిసిపోయింది..ప్రోగ్రెస్ రిపొర్టు లో మార్కులు తక్కువ వస్తే ఎలా చూపించాలని నాన్న సంతకం నేనే పెట్టటం ఆ సంగతి ఇంట్లో తెలియటం.. హమ్మో ఇప్పుడు ఇంటికెళితె ఇంకేమన్న ఉందా ఉతికి ఆరెయ్యరు అని మనం ఇంటికి వెళ్ళకుండా బెజవాడ వెళ్ళటం ..దాంతో ఇంట్లొ వాళ్ళు నాకోసం వెతకటం..మొత్తానికి ఇంటికి రావటం అన్ని ఇంకా తడి ఆరని గుర్తులే..ఇంటికొచ్చాక తెలిసింది నాన్నకి నా మీద ఎంత ప్రేమ ఉందో..ఎవరెస్ట్ అంత ప్రేమ ఉంచుకుని పైకి గాంభీర్య ప్రద్రర్శిస్తున్న నాన్న చూసి మా నాన్న సూపర్ అనుకున్నా..అయినా భయం మాత్రం ఇంకా తగ్గలేదు..
కాలేజీ రోజుల్లో ఇంటికి వచ్చే తిరిగి వెళ్ళేటప్పుడు నాన్న ఖర్చులకు డబ్బులు ఇవ్వండి అంటే లేదు పద కాలేజీకి నేను వస్తున్నా..మీ హెడ్ తొ మాట్లాడాలి ఎలా ఉంటున్నావో కాలేజ్ లో అంటే నాకు చచ్చే వణుకు వచ్చేది ఎక్కడ వస్తారో ..అని వస్తే మన వేషాలు అన్ని తెలిసిపోతాయి కద మరి ..చివరికి లాస్ట్ మినిట్ లో డబ్బులు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి పంపేవారు..పాపం అమ్మ ఎందుకు అన్ని డబ్బులు అన్నా వినకుండా..(కాలేజ్ లో జాయిన్ చేసిన రోజు వచ్చిన నాన్న మళ్ళీ కాలేజ్ వంక చూడలేదు)..చదువు అయిపోయి జాబ్ లొ జాయిన్ అయి అది వదిలేసి మీడియాలోకి వచ్చిన నన్ను చూసి బాధపడ్డారు తప్ప ఒక్క మాట అనలేదు..నీ చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఎమన్న సంబంధం ఉందా అన్న మాట తప్ప.. కూడా నేను కూడా నాన్నఅయినా ఇప్పటికి నాన్న బాధ ఒక్కటే .నా భవిష్యత్తు గురించే...నేను ఓ తండ్రి అయినా ఇంకా నా గురించి పడే తపన చూస్తే ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ..ఒక్క ఐ లవ్ యూ డాడీ అని చెప్పటం తప్ప..

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

ప్రేమ బదిలీ వయా కొడుకు టూ మనవడు






ఏమ్మా….జాగ్రత్తగా వెళ్ళు.. వేళకు తిను. ఏంటో ఈ రోజు బాగా గుర్తు వస్తున్నావు రాఇలాంటి మాటలు అమ్మ చెపుతుంటే ఏమ్మా రోజు నా గురించే ఆలోచనేనా! .. నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా.. టైం కి డాక్టర్ దగ్గరకు వెళ్ళు అని చెప్పేవాడిని .. దూరప్రాంతంలో ఉద్యోగం చేసే వాళ్ళు పేరెంట్స్ చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ వాళ్ళు ఎంత బాధపడతారో మొదటిసారి నాకు అనుభవంలోకి వచ్చింది.. నాకు కొడుకు పుట్టి వాడిని చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ నేను పడిన వేదన స్వంతంగా నేను అనుభవిస్తే తప్పా

ఇప్పటివరకు నాకు ఉన్న ఆలోచలను మార్చి వేసింది.. అప్పుడే నా జీవితంలోకి వచ్చిన వాడిని వదిలి ఉండలేక పోతుంటే.. ఇరవై తొమ్మిది సంవత్సరాలు నా మీదనే పంచప్రాణాలు పెట్టుకున్న మా అమ్మా నాన్న నన్ను ఎంత మిస్ అవుతున్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది.. కానీ ఏమి చేస్తాం.. మనం అనుకున్న లక్ష్యాలు చేరాలంటే ఇటువంటివి ఓర్చుకోక తప్పదు మరి అయినా మా అబ్బాయిని ఎవరి దగ్గర వదిలి వచ్చాను అమ్మకు దగ్గరగానేగా.. తన రక్తం పంచుకుపుట్టినా నన్ను ఎంత ప్రేమ గా చూసుకుందో దానికి రెట్టింపు ప్రేమతో నా రక్తం పుట్టిన వాడిని చూసుకుంటుంది గా సో నో వర్రీస్ .. అమ్మా యూ రాక్స్..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

మహిళా నీకు వందనం



మార్చి ఎనిమిది ఈ  రోజు ప్రపంచ మహిళా దినోత్సవం..సరిగ్గా నేటికి వందసంవత్సరాలు పూర్తి చేసుకుంది..వందేళ్ళూ పూర్తి  చేస్తుకున్న మహిళలు పరిస్థితులు మారాయా అంటే ఖచ్చింతగా మారలేదని చెప్పవచ్చు..బాగా చదువుకుని  కార్పోరేట్ కంపెనీలో పని చేసే అమ్మాయి అయినా ..చదువు కొనలేక పని పిల్లగా పని చేసే అమ్మాయి అయినా ఎదుర్కోనే ఇబ్బందులు ఒక్కటే ..లైంగిక వేదింపులు.కట్న పిశాచుల ఆగడాలు.. సైకో ప్రేమికుల శాడిజానికి  ఎవరైనా బలవ్వాల్సిందే ...నిజానికి ఆకాశంలో సగం ..అన్నింటిలో సగం అని చేప్పే ఆడవాళ్ళు సమస్యలు వచ్చినప్పుడూ మాత్రం బేలగా మారతారు..తమకు వచ్చిన ఏ ఆపదలను ఎవరితోను చెప్పుకోరు ..వారిలో వారే కుమిలిపోతుంటారు,ఉదయం ఉద్యోగానికి సిటి బస్ ఎక్కితే రద్దీ ని అడ్డుపెట్టుకుని ఆనందించే వారు కొందరు అయితే ..ఆఫీసులో వేసే డబులు మీనింగ్ డైలాగ్స్ వేసి ఆనందించే వారుమరి కొందరు ..ఎవరు ఎమన్నా..ఎవరు ఏమి చేసినా  ఒంటీ మీద తేళ్ళూ జేర్రులు పాకుతున్నట్లు ఉన్నా సహనంగా ఉండటం మీకు మాత్రమే సొంతం.వంటింటిని అలంకరించిన పరికరంలాగా మారిన జాతి గొంతు పెగుల్చుకొని, స్వంత అస్తిత్వాన్ని చాటుకునే క్రమంలో ఇప్పుడొక చేయూత కావాలి. సంకెళ్ళు తెగతెంచుకునే పోరాటంలో ఇప్పుడొక బాసట కావాలి.

వ్యక్తిత్వం చాటుకునే తరుణంలో ఇప్పుడొక దన్ను కావాలి. అందుకే మార్చి 8 పైనా, మహిళా సాధికారత పైనా చర్చోపచర్చలు, ప్రశ్నోపప్రశ్నలు.
‘మహిళా సాధికారత’ అంటే ”సమాజంలో మహిళలకు సముచితస్థానం కల్పించడానికి విధానాలలో మార్పుతేవడం మాత్రమే కాదు, సమాజ వైఖరిలోనూ మార్పు రావడం.”మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ”మహిళా సాధికారత అంటే మహిళలు కుటుంబంలో, సమాజంలో, రాజకీయ రంగంలో చురుకైన నిర్ణాయక పాత్రను నిర్వహించడం.”ఆ దిశగా అడుగులు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు ..దానికోసం మహిళను చూసే దృష్టిలో మార్పు కోసం మహిళలే కాదు మహిళాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాల్సి ఉంటుంది.14 ఏళ్ళుగా పురిటి నోప్పులు పడుతున్న మహిళా బిల్లుకి ఈ సంవత్సరం అన్నా మోక్షం లభిస్తుందో లేదో చూడాలి..
అయినా  ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తే కనుక… ఎక్కువ ఖర్చు ఆయుధాల మీద, సైన్యం మీద పెట్టరు. శాంతికోసం పెడతారు. కన్నబిడ్డలు ప్రాణాలు కోల్పోవడం ఏ తల్లి చూడగలుగుతుంది?.అందుకే .ఓ మహిళా అందుకో మా వందనం

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

శివోహం ..శివోహం..








శివరాత్రి ... పండుగ అనగానే మనసు జెట్ కంటే వేగంగా వెనుకకు పరిగెత్తింది..నా చిన్నప్పుడు ఈ పండుగ మా ఊరిలో చాలా బాగా జరిగేది..అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ అప్పటిలా ఎవరు ఈ తిరునాళ లో(ఒక్కొ ప్రాంతంలో ఒకలా పిలుస్తుంటారు ) పాల్గోనటం లేదు మా ఇంటి కి దగ్గరలోనే కృష్ణానది ఉత్తరానికి పారేది... .
.ఆ పక్కనే శివాలయం ఉండేది..ఆ రొజు తెల్లవారుజామునే నిద్ర లేచి అమ్మ తో కలిసి నదీ స్నానానికి వెళ్ళేవాడిని ..నదీ స్నానం అంటే నేను ఏదో తెగ ఈత గట్రా కోట్టే వాడిని అనుకుంటున్నారా..మనకి అంత సీన్ ఎక్కడ ఏడ్చింది ..మా అమ్మ పక్కన రెండు మూడు మెట్లు దిగి మూడు మునకల స్నానమే ..అది కానిచ్చి నిదానంగా బయటకు వచ్చి హడావుడిగా గుడిలోకి పరుగుతీసేవాళ్ళము ..లేకపోతే గుడిలో జనం పెరిగి అయ్య గారు కూడా పూజ సరిగా చేయరని ముందుగానే పూజా కార్యక్రమాలు..ప్రసాదాలు పనులు పూర్తి చేసుకుని నిదానంగా బూరలు అవి కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళం ..ఈ లోపు అమ్మ మిగతా దేవుళ్ళకు కూడా కోరికల లిస్ట్ చెప్పేసి ఇంటికి తీసుకేళ్ళేది ..ఇక మధ్యాహ్నం నుండి ప్రెండ్స్ అందరం బయలు దేరేవాళ్ళం ..అప్పట్లో మా బ్యాచ్ మొత్తం 15 మంది ఉండే వాళ్ళం .ఆడినా పాడినా ఏమి చేసినా ఈ పదిహేను మందే ..ఇంకో గంటలొ బయలు దేరాతాము అనగా అందరం సైకిళ్ళ అన్నింటికి పుల్ గా ఆయిల్ .వేసి .గాలి అవి సరిగా ఉన్నాయో లేదో చూసుకుని ఒక్కొ దానికి ఇద్దరేసి చొప్పున రిం రిం జిం అనుకుంటూ ఉషారుగా వెళ్ళే వాళ్ళం ...తిరునాళ అంతా తిరిగి చివరికి ఒక చిట్టి కప్ప ..బాగా శబ్దం వచ్చే బూర లు కొనేవాళ్ళం..కొంతమంది చేతివాటం చూపించేవాళ్ళూ ..

చివరికి అలసి సొలసి ఒక కలర్ సోడానో లేక పుల్ల ఐసో తిని బెల్లం చెరుకు గడలు కోనుక్కొని ..ఆ పక్కనే ఉన్న రాజా గారి కోటలొ ఎవరూ చూడకుండా తిరిగి చీకటి పడుతుందనగా ఇంటికి చేరే వాళ్ళం.

.కొంచెం పెద్ద అయిన తరువతా మా ఊరికి కోంచెం దూరంగా ఉన్న గ్రామంలో కూడా పండుగా బాగా జరిగేది ..పండుగ అనే కంటే అక్కడ మసాలా (అదేనండి రికార్ఢింగ్ డ్యాన్య్సులు ) ఉండేది దాంతొ అక్కడ ఇసుకేస్తె రాలనంత జనం ఉండేవాళ్ళూ అయినా మేము మాత్రం ఎవరన్నా గుర్తు పడతారేమో అన్నట్టూ ముఖానికి రుమాలు కట్టుకుని తిరిగేవాళ్లం..చివరికి ఈ సంగతి ఇంట్లొ తెలిసి కొందరికి వీపు విమానం మోతలు ..మరి కొందరికి చెవులు చిల్లులు పడేలా తిట్లు (దీనిలో నాది ఏది అని మాత్రం అడక్కండి) ..ఇక ఆ తరువాత అందరు పై చదువులు అంటూ వేరు వేరు ఊర్లకు వెళ్ళటం..ఆపై ఉద్యొగాలు అంటూ ఇంకా దూరప్రాంతాలకు పొవటం వల్ల అసలు ఇప్పుడు మా స్నేహితుల్లో ఈ పండుగ గురించి ఆలొచించటమే మానేసారు .ఒక వేళ ఒకరిద్దరు వచ్చిన ఇప్పుడు ఇంటికే పరిమితమవుతున్నారు..అయినా ఇప్పటికి అక్కడ పుల్ల ఐస్ దొరుకుతుంది ..కలర్ సొడా అమ్ముతున్నారు ..అవి తినే..తాగే సాహసం చేయగలమా..ఎందుకంటే జీవన విధానం మారింది ..క్వాలిటీ వాల్స్ ముందు పుల్ల ఐస్ ,పెప్సి కోలాలు ముందు కలర్ సోడాలు అనటం లేదు ఇంట్లొ పాత డబ్బా వేసి తిన్న పీచు మిటాయి అనుభూతి మెక్ డోనాల్డ్ లో వంద రూపాయిలు పెట్టి తిన్న పిజ్జా కూడా ఇవ్వదు..నాకు కానీ టైం మిషన్ దొరికితే ఎంచక్కా నా బాల్యానికి వెళ్ళిపోతాను ..అక్కడ ఈ హిపోక్రసి లు ..ఉండవు ఎంచక్కా కర్రా బిళ్ళా,గోలీలు ఆడుకోవచ్చు

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS