RSS

ప్రేమ బదిలీ వయా కొడుకు టూ మనవడు


ఏమ్మా….జాగ్రత్తగా వెళ్ళు.. వేళకు తిను. ఏంటో ఈ రోజు బాగా గుర్తు వస్తున్నావు రాఇలాంటి మాటలు అమ్మ చెపుతుంటే ఏమ్మా రోజు నా గురించే ఆలోచనేనా! .. నీ ఆరోగ్యం గురించి ఆలోచించవా.. టైం కి డాక్టర్ దగ్గరకు వెళ్ళు అని చెప్పేవాడిని .. దూరప్రాంతంలో ఉద్యోగం చేసే వాళ్ళు పేరెంట్స్ చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ వాళ్ళు ఎంత బాధపడతారో మొదటిసారి నాకు అనుభవంలోకి వచ్చింది.. నాకు కొడుకు పుట్టి వాడిని చూసి తిరిగి వెళ్ళేటప్పుడూ నేను పడిన వేదన స్వంతంగా నేను అనుభవిస్తే తప్పా

ఇప్పటివరకు నాకు ఉన్న ఆలోచలను మార్చి వేసింది.. అప్పుడే నా జీవితంలోకి వచ్చిన వాడిని వదిలి ఉండలేక పోతుంటే.. ఇరవై తొమ్మిది సంవత్సరాలు నా మీదనే పంచప్రాణాలు పెట్టుకున్న మా అమ్మా నాన్న నన్ను ఎంత మిస్ అవుతున్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది.. కానీ ఏమి చేస్తాం.. మనం అనుకున్న లక్ష్యాలు చేరాలంటే ఇటువంటివి ఓర్చుకోక తప్పదు మరి అయినా మా అబ్బాయిని ఎవరి దగ్గర వదిలి వచ్చాను అమ్మకు దగ్గరగానేగా.. తన రక్తం పంచుకుపుట్టినా నన్ను ఎంత ప్రేమ గా చూసుకుందో దానికి రెట్టింపు ప్రేమతో నా రక్తం పుట్టిన వాడిని చూసుకుంటుంది గా సో నో వర్రీస్ .. అమ్మా యూ రాక్స్..


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

3 comments:

Raveendar Kondaparthy said...
This comment has been removed by the author.
Raveendar Kondaparthy said...

మురళి గారు... చాలా బాగా రాసారు అండి... ఈ లోకం లో తల్లి, తండ్రుల ప్రేమని అర్దం చేసుకోవాలంటే తనకి తానుగా అనుభవం లోకి వస్తేనే వారి ప్రేమని మరింత దగ్గరగా చూసిన వారము అవుతాము...!!!

sarath said...

గుండెలు పిండేశావ్....
రేపు ఉదయం రెండు కర్చీఫ్ లు పట్రా.... ఒకటి నీకు... ఒకటి నాకు.... వద్దులే రెండోది కూడా నీకే.....బాగా ఫీలవుతున్నావ్ గా.... నేను చేత్తో తుడుచుకుంటా...

Post a Comment