RSS

బై..బై..హస్తినాపురం..

హయ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నా ఆలోచనలతో మీ ముందుకు వచ్చాను...మూడు సంవత్సరాలు డిల్లీలో ఉండి వెళుతున్న నాకు నా అనుభవాలను మీతో పంచుకోవాలనిపించింది..సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చలితో నగరం గడ్డకట్టుకుంటున్న వేళ దేశరాజధానిలో అడుగుపెట్టాను..ఈ మూడు సంవత్సరాలు కాలం చాలా వేగంగా పరిగెత్తింది ..ఈ మూడేళ్ళలోనే ఒక్కడిని ఇద్దరం..ఆపై ముగ్గురం కూడా అయ్యాము.. మహాటివి నాకు దేశ రాజకీయాలను దగ్గర నుండి మరీ ముఖ్యంగా దేశ నాయకులను దగ్గరనుండి చూసే అవకాశం కల్పించింది..నేను డిల్లీలో అటెండ్ అయిన మొదటి ప్రెస్ మీట్
ఈ మూడేళ్ళ కాలంలో నాలో చాలా పరిణితి వచ్చింది ..అయితే నాలో ఉన్న సైటైరిక్ స్వభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగిన మాట వాస్తవం..అలానే ఈ మూడేళ్ళల్లో వార్తల వెనుక వాస్తవాలు తెలుసుకోగలిగాను..ఢిల్లీ వచ్చిన కొత్తల్లో బెరుకు బెరుకుగా తిరిగిన ప్లేసులు ఇప్పుడూ వదిలి వెళ్తుంటే బాధ గా ఉంది ..ఇంకా సోనియా గాంధీ ..ఆజాద్ ఇంటి దగ్గర..పడిగాపులుండవు అలానే విజయ్ chowk దగ్గర నేతల కోసం నిరీక్షణలుండవు అనేది తల్చుకుంటే మనసు కెలికినట్టుంది అవును మరీ అక్కడ సొల్లు చెప్పుకుంటు తినే పల్లీలు..మసాల చాట్ ఉండవు కదా
డిల్లీ వచ్చిన ఓ సంవత్సరం తర్వాత ఇంట్లో పెళ్ళి చేసుకోమని పోరుతుంటే మిత్రులందరు కొంచెం లావుగా ఉన్నావు అంటే సీరియస్ గా షటిల్ ఆడటం మొదలుపెట్టాను..సుమారు సంవత్సరం పాటు ఆపకుండా ఆడి ఇంట్లో వాళ్ళూ తిట్టేంత సన్న బడ్డాను.నేను ఆపకుండా సంవత్సరం పాటు షటిల్ ఆడాను అంటే నా అత్యంత సన్నిహితమిత్రుడు జయప్రకాష్ అలియాస్ జెపి నే కారణం
అలా అలా జాలీగా ఆడుకుంటూ పని చేసే సదుపాయం డిల్లీలో మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ యాక్టివిటి అంతా మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచేం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవటానికి సాద్యం అవుతుంది వివాహ విద్యా నాశాయ అన్నట్టు నా విషయంలో మాత్రం వివాహా షటిల్ నాశాయ అయ్యింది పెళ్ళై కాపురం పెట్టిన తరువాత ఇప్పటి వరకు తిరిగి బ్యాట్ పట్టుకుంటే ఓట్టు ..మరీ...డిల్లీ వచ్చిన తరువాత ఇద్దరు మాత్రమే ఆత్మ బంధువులు అయ్యారు..నేను ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో అర్ధం చేసుకుని నేను ఏమన్న డిల్లీలో సాధించింది ఉంది అంటే దానిలో భాగం వీరిద్దరికి దక్కుతుంది
ఢిల్లీలొ పనిచేయటం వల్ల పొలిటికల్ వార్తలతో పాటు సుప్రీంకోర్టులో వచ్చే కేసుల వార్తలను కూడా కవర్ చేయటం ఎలానో నేర్చుకునే అవకాశం దక్కింది..దాంతో పాటు మన దేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కామన్ వెల్త్ గేమ్స్ ,,వరల్డ్ కప్ మ్యాచ్ లను కవర్ చేసే అవకాశం దక్కింది
మొత్తం మీద ఢిల్లీ వదిలి వెళ్ళాలని లేనప్పటికి మా అబ్బాయి కోసం హైదరబాద్ వెళ్ళక తప్పని పరిస్థితి ..మూడు సంవత్సరాల క్రితం అయినను పోయి రావలే హస్తినాపురికి అన్నట్లు వచ్చిన నేను అయిష్టంగానే తిరిగి భాగ్యనగరానికి వెళుతున్నాను్...మిస్ యు ఢిల్లీ

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS